Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టిక్​టాక్​లో లేఆఫ్​లు... 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన

TikTok Layoffs 700 Employees
Advertisement
  • మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల తొల‌గింపు
  • ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్‌
  • ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకే ఈ నిర్ణయమ‌న్న సంస్థ‌  
  • ఈ ఏడాది మేలో కూడా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగుల ఉద్వాస‌న‌
Advertisement
ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌... మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ప‌లికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్‌ అందినట్లు స‌మాచారం.
 
కాగా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఉద్వాస‌న‌ను టిక్‌టాక్ ధృవీక‌రించింది. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. తన వ్యూహాత్యక చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్ల‌డించింది.

ఇక 2024 మేలో కూడా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులను టిక్‌టాక్‌ తొలగించిన విష‌యం తెలిసిందే. మార్కెటింగ్‌, కంటెంట్‌ విభాగాల్లోనే ఈ తొలగింపులు చోటుచేసుకున్నాయి.
Advertisement
Advertisement
TikTok Layoffs
Social Media

More Telugu News